తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ. ఇది పూల జాతర .ఇది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వచ్చే ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని తొమ్మిది రోజుల వరకు రోజుకో తీరున బతుకమ్మను పూలతో పేరుస్తారు. బతుకమ్మ కు కొన్ని వేల ఏండ్ల చరిత్ర ఉన్నది.చోళ రాజైన ధర్మాంగద దీనికి వందమంది కుమారులు పుట్టి యుద్ధంలో చనిపోతారు తరువాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఓ ఆడపిల్ల పుడుతుంది.అమ్మాయికి పెట్టిన పేరే బతుకమ్మ తర్వాత అమ్మాయి బతుకమ్మ పూజలందుకున్న ది.రకరకాల పూలను సేకరించి పేర్చి దానిపై పసుపు ముద్ద నిలిపి గౌరీదేవిగా కొలుస్తారు. ప్రతిరోజు సాయంత్రం బతుకమ్మ ఆడుకునే చెరువులను బావిలో నిమజ్జనం చేస్తారు. దసరాకు ఒకటి రెండు రోజుల ముందు సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాట ఉద్యమం ఒక పోరాటం ఎదిగింది బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ.బతుకమ్మ పేర్చడం లో వాడే ఆకులు పూలు మంచి ఔషధాలు కలిగినటువంటి. ఇవి ఇవి నీటిని శుద్ధి చేసే గుణం కలిగి ఉంటాయి.
1. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ ఏది?